Sunday, April 9, 2023

Photo from VEERAREDDY GADE

*బాపట్ల లోని సూర్యలంక సముద్రతీరం శివ క్షేత్రానికి మాజీ మంత్రివర్యులు గాదె వెంకటరెడ్డి లక్ష విరాళం*


బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు 10 కోట్ల వ్యయంతో  నిర్మాణం అవుతున్న తారకేశ్వర స్వామి ఆలయానికి *బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గాదె వెంకటరెడ్డి* ఈరోజు వారి కుమారులు వైఎస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గ నాయకులు *గాదె మధుసూదన రెడ్డి* ద్వారా *లక్ష* రూపాయలు విరాళాన్ని తారకేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ మంతెన దశరథ మహారాజు మరియు మూర్తి రాజులకు ఈరోజు అందజేయడం జరిగింది.. అనంతరం *గాదె మధుసూదన రెడ్డి* ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ స్తపత గౌరవనీయులు గోపాలకృష్ణ శర్మ, వైయస్సార్సీపి బాపట్ల నియోజకవర్గం అల్లం గోపికృష్ణ, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు జిట్టా శ్రీనివాసరావు, వైయస్సార్సీపి మహిళా నాయకురాలు జి గిరిజారాణి, వైయస్ఆర్సీపీ నాయకులు దోమా నాగేశ్వర రెడ్డి, కుంచాల వీర రాఘవరెడ్డి, డేగల రవి రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.. 

No comments:

Post a Comment