Saturday, June 24, 2023

ది.23-6-2023 మాజీ మంత్రివర్యులు గాదె వెంకట రెడ్డి గారి తనయులు బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు విచ్చేసి నియోజక వర్గ స్థాయిలో 2022-23 S.S.C పరీక్షలలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన జగనన్న ఆణిముత్యాలు షేక్ ఖదిరా కు 15,116/- లు షేక్ జాస్మిన్ కు 10,116/- లు ప్రోత్సాహక బహుమతులను అందించి ప్రధానఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో సన్మానించి అభినందించి, విద్యార్థులు చిన్నతనం నుండి ఇంగ్లీష్ భాషలో వాక్ నైపుణ్యం పెంపొందించుకొని పై చదువులలో ఇప్పుడు పొందిన స్థానాలను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. వక్తలు మాట్లాడుతూ గడచిన కాలంలో గాదె వెంకట రెడ్డి గారు చందోలు గ్రామంలోని ఈ పాఠశాల మరియు కళాశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు, ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కే.మురళీధర్ రావును మరియు,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయు లను ఘనంగా సన్మానించారు గ్రామ పెద్దలతో కలిసి ప్రభుత్వ. బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు తదనంతరం పాఠశాల అభివృద్ధి కమిటీ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కలిసి గాదె మధుసూదన రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ తిథులు, మస్తాన్ బేగ్, రఫీ, గిరిజారాణి,డేగల రవి రెడ్డి, మారు బోయిన శ్రీనివాస్ రెడ్డి,జి.ఆనంద్ రావు,దోమ నాగేశ్వర రెడ్డి,మద్దాల డేవిడ్,కె.ఏ.పాల్ కుంచల వీర రాఘవరెడ్డి,సయ్యద్ నూరుల్లా, గాదె అభిమానులు,గాదె యువసేన మరియు తదితర గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

బాపట్ల జిల్లా,కర్లపాలెం మండలం,యం.వి.రాజుపాలెం గ్రామంలో పిట్ల వారి ఇలవేల్పు శ్రీ రేణుక అంకమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి కొరకు తనవంతుగా 50,000 /- లు విరాళం ప్రకటించిన మాజీ మంత్రివర్యులు గాదె వెంకట రెడ్డి గారి తనయులు బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి తదనంతరం ఆలయ కమిటీ వారు మధుసూదన రెడ్డిని దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు,ఈ కార్యక్రమంలో గాదె యువసేన,గాదె అభిమానులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల మండలం నాగేంద్రపురం గ్రామంలో వేంచేసి ఉన్న శవనం వారి ఇంటి ఇలవేల్పు *శ్రీ వీర్లంకమ్మ తల్లి అమ్మవారి కొలుపుల మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ అభివృద్ధి కొరకు 20,000/- విరాళము అందించిన బాపట్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఈ కార్యక్రమంలో గాదె అభిమానులు గాదెవసేన మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Friday, June 23, 2023

చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ బంగాళాముఖి అమ్మవారి వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు *గాదె మధుసూదన రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రములు పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయనవెంట గాదె అభిమానులు మరియు గాదె యువసేన పాల్గొన్నారు.

కర్లపాలెం మండలం, పాత నందాయపాలెం గ్రామ వాస్తవ్యులు రావి సుభాష్ రెడ్డి, పద్మ దంపతుల కుమార్తె చిరంజీవి శశికళ మరియు కుమారుడు చిరంజీవి షణ్ముఖ వంశీకృష్ణారెడ్డి ల నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమం స్థానిక పెద్దింటమ్మ దేవాలయ ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది.. ఈకార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన బాపట్ల నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అల్లం గోపికృష్ణ, రోటరీ క్లబ్ అఫ్ బాపట్ల మాజీ అధ్యక్షులు జిట్టా శ్రీనివాసరావు, వైయస్సార్ సిపి మహిళా నాయకురాలు జీ. గిరిజారాణి, దోమా నాగేశ్వర రెడ్డి, కుంచాల వీర రాఘవరెడ్డి, డేగల రవిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

 

                                        

దరివాద కొత్తపాలెం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసోది నాగార్జున రెడ్డి(బుజ్జి) సతీమణి కీర్తిశేషులు శ్రీమతి వకులాదేవి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి, వకులాదేవి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన  బాపట్ల నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె మధుసూదన రెడ్డి మరియు తదితరులు.